- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో 2023-24 అకాడమిక్ ఇయర్ కు సబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 63.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థులు 1.62 లక్షల మంది ఉత్తీర్ణులయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్లో 53.24 శాతం, ఒకేషనల్ సెకండ్ ఇయర్ లో 51.12 శాతం, రెగ్యులర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో 43.77 శాతం మంది ఉత్తీర్ణులయినట్లు తెలిపారు.
ఫ్రథమ, ద్వితీయ జనర్ ఇంటర్మీడియట్ ఫలితాలతో పాటు ఓకేషనల్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ అధికారిక వెబ్ సైట్ లో పరిశీలించుకోవచ్చని కూడా అధికారులు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3 వరకు ఈ-అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.
ఫలితాల కోసం tgbie.cgg.gov.in వెబ్ సైట్ చూడండి.
- Advertisement -