Monday, December 23, 2024

జులై 1 నుంచి పెరుగనున్న హీరో మోటో ద్విచక్ర వాహనాల ధరలు

- Advertisement -
- Advertisement -

ముంబై: హీరో మోటో కార్పొరేషన్ తన ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ మీద ఎంత ధరను పెంచనున్నది ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.

ఒకవేళ పెంచేట్టయితే రూ. 1500 వరకు పెంచే అవకాశం ఉంది. మోడల్ ను బట్టి ధర పెంపు ఉండనున్నది. హీరో మోటార్ సైకిళ్లలో స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ఎక్స్ టెక్, సూపర్ స్ల్పెండర్, ఎక్స్ టెక్, గ్లామర్ ఎక్స్ టెక్, ఎక్స్ ట్రీమ్ 125 ఆర్, ఎక్స్ ట్రీమ్ 4వి, ఎక్స్ ట్రీమ్ 200 4వి, ఎక్స్ ట్రీమ్ 160 ఆర్, మావ్రిక్ 440 వంటివి ఉన్నాయి. స్కూటర్లలో హీరో డెస్టినీ  ప్రైమ్, డెస్టినీ 125 ఎక్స్ టిఈసి, జూమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News