- Advertisement -
సిఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని, కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ మంత్రి కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పథకాలు పక్కదోవ పట్టాయని ఆయన ఆరోపించారు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు దళిత బంధులో అక్ర మాలకు పాల్పడినట్లుగా బహిరంగ సభలో ప్రస్తావించారని తుమ్మల దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
అధికారంలో ఉన్న ఏనాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ, రైతుల పురోగతి ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని తుమ్మల పేర్కొన్నారు. అన్నదాతలకు బాసటగా నిలవడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండు తమ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
- Advertisement -