Monday, December 23, 2024

T20 WC సూపర్ 8: భారత్ పై బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8లో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. సెయింట్ లుసియాలోని డారెన్ స‌మీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆస్టన్ అగర్ స్థానంలో మిచెల్ స్టార్క్ జట్టులోకి తీసుకున్నారు. ఇక భారత్ జట్టులో ఎలాంటి మార్పు లేదు.

తుది జట్లు

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News