Sunday, December 22, 2024

వెబ్‌సైట్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లు

- Advertisement -
- Advertisement -

గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరించింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌తో వివరాలు నమోదు చేసుకుని ఒఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 9వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిజిపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయగా, 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,03,645 హాల్ టికెట్లను టిజిపిఎస్‌సి జారీ చేసింది. అందులో 3,02,172 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. ఈనెల 13న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల చేయగా, దానిపై అభ్యంతరాలు తెలియజేందుకు ఈనెల 17 వరకు గడువు ఇచ్చింది.

అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత త్వరలోనే టిజిపిఎస్‌సి తుది కీ విడుదల చేయనున్నది. తుది కీ ఖరారైన తర్వాత వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మల్టీజోన్, రిజర్వేషన్లను బట్టి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News