Sunday, October 6, 2024

ఉప్పల్ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్‌పై వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ఉప్పల్ -టు ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులు 4 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయని వెంటనే ఈ కాంట్రాక్ట్ సంస్థను టెర్మినేట్ చేసి కొత్త టెండర్లు పిలిచి ప నులు పూర్తిచేయాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అధికారులకు ఆదేశాలు జారీ చేరని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పే ర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి తరఫు న కేంద్రమంత్రికి నితిన్‌గడ్కరీకి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత మంత్రి కో మటిరెడ్డి మీడియతో మాట్లాడుతూ తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తున్నామని 8 పార్లమెంట్ సీ ట్లు గెలుచుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం లో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంపై వి శేష కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టమని కేంద్రానికి లేఖ రాయడం తో ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిన విషయం అందరికీ తెలుసనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి యుటిలిటీ ఛార్జీలు కడతామని లేఖ ఇచ్చామన్నారు. దీంతోపాటు రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులను నితిన్ గడ్కరీకి వివరించడంతో వారే స్వయంగా యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు.

17 బ్లాక్ స్పాట్ పనులను ప్రారంభించాం
ఎన్నికల కారణంగా ఆర్‌ఆర్‌ఆర్, హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే పనులు కాస్త ఆలస్యం అయ్యాయని కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 60 వేల వాహనాలు ప్రయాణిస్తాయని జీఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకొని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలు చూపించి పనులు పూర్తిచేయలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. దీనివల్ల ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దానివల్ల చాలామంది వికలాం గులుగా మారుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎంపిగా ఉన్నప్పుడు రోడ్డు యొక్క పరిస్థితిని వివరిస్తే ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి వాటి మరమ్మతుల కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ. 375 కోట్లను మంజూరు చేసినప్పటికి పనులు చేయాల్సిన జీఎంఆర్ సంస్థ రెండుసార్లు కోర్టుకు పోయి పనులు చేయకపోతే మూడోసారి టెండర్ పిలిచి రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

డిసెంబర్ లోపు టెంపరరీ రిలీఫ్ కోసం పనులు పూర్తి
డిసెంబర్ లోపు టెంపరరీ రిలీఫ్ కోసం పనులు పూర్తి చేస్తామని, ఒక్క బ్లాక్ స్పాట్స్ రిపేర్లు మాత్రమే కాకుండా 6 లేన్ల రోడ్డును నిర్మించాలని అధికారులతో కలిసి తాను స్వయంగా గడ్కరీకి వివరించానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడ్కరీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని మరోసారి విన్నవించామని దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వాటికి జాతీయ రహదారుల సంఖ్యను కేటాయించాలని విన్నవించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. వారు భారతమాల క్రింద దానిని మంజూరు చేస్తామని చెప్పారన్నారు. ఈ రెండు రోజుల్లో రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కావాల్సిన అటవీ అనుమతుల కోసం కేంద్ర అటవీశాఖమాత్యులు భూపేంద్ర యాదవ్‌ను కలవనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News