Monday, December 23, 2024

దుర్గం చెరువులో దూకి యువకుడి ఆత్మహత్యయత్నం

- Advertisement -
- Advertisement -

ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించగా పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం…పర్వత్‌నగర్‌కు చెందిన ఎం. సాయికిరణ్(23) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చాడు. అక్కడ అనుమానస్పదంగా తిరుగుతుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆత్మహత్య విషయం బయటపడింది. వెంటనే యువకుడిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News