Saturday, November 23, 2024

ఫిరాయింపులపై సుప్రీంకు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటాన్ని ఆ పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎంఎల్‌ఎలు వరుసగా పార్టీ మారుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం ఎంఎల్‌ఎల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్ర జల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతున్న ఎంఎల్‌ఎల అనర్హత విషయంలో న్యాయపోరాటానికి పార్టీ సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మే రకు న్యాయ నిపుణలతో చర్చిస్తున్నట్లు సమాచారం. సు ప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెల ల్లో అనర్హత పిటిషన్‌పై సభాపతి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది.

ఉ న్నత న్యాయస్థానం తీర్పులో పేరా నెంబర్ 30, 33 ప్ర కారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవస రం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. బిఆర్‌ఎస్ పా ర్టీ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తి కావస్తుంది. ఈ నెల 27న ఆయన అనర్హత అంశంపై హైకోర్టులో వి చారణ జరగనుంది. హైకోర్టు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయకుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌తో పా టు పార్టీ మారిన ఎంఎల్‌ఎల అందరిపై ఒకేసారి బిఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News