నితీశ్ కుమార్‌కు చోటు
జింబాబ్వే టి20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
ముంబై : జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత జట్టులో సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు, తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఇక ఈ యువ జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్‌లకు ఈ జట్టులో అవకాశం కల్పించారు. వికెట్ కీపర్లుగా వెటరన్ ప్లేయర్ సంజూ శాంసన్‌తో పాటు యువ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. తెలుగు తేజం, పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటిన రియాన్ పరాగ్‌కు కూడా అవకాశం దక్కింది. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా చోటు దక్కించుకోగా. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తుషార్ దేశ్‌పాండేలు పేసర్లుగా ఎంపికయ్యారు. ఇక జులై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 జులై 6న, రెండో టీ20 జులై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జులై 13న, ఐదో టీ20 జులై 14న జరగనుంది.
జట్టు వివరాలు..
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.
సారథిగా గిల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -