Monday, December 23, 2024

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళ ఎంపీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన లోక్ సభ ఎంపీ గోపి నాథ్ పార్లమెంటులో తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజూ కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అనేక మంది ఎంపీలు తమ మాతృ భాషలో ప్రమాణం చేశారు.

తమిళనాడు, పుదుచ్చేరి కి చెందిన 40 మంది ఎంపీలు లోక్ సభ రెండో మధ్యాహ్నం 2.15 గంటలకు ఒక్కొక్కరుగా  ప్రమాణస్వీకారం చేశారు. కాగా కృష్ణగిరి ఎంపీ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి ఆంధ్రప్రదేశ్ ను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ తమిళులు ఎక్కువే అయినప్పటికీ, తర్వాతి స్థానాలలో తెలుగు, కన్నడ వారు అధికంగా నివసిస్తుంటారు. తమిళనాడు నుంచి బెంగళూరుకు వెళ్లే దారి మధ్యలో ఉంటుంది ఈ కృష్ణగిరి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News