Sunday, September 29, 2024

జులైలో రష్యా పర్యటనకు ప్రధానిమోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ జులైలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. భారత్ష్య్రా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ ఈ సమాచారం వెల్లడించింది. మోడీ పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్‌తో ఆయన సమావేశం ఉంటుందని మార్చినెలలో క్రెమ్లిన్ వెల్లడించింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలు ఉన్నప్పటికీ, మనం మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా మాస్కోఢిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతం లోనే పుతిన్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ పరిణామాలపై తాను మోడీతో మాట్లాడానని చెప్పారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా భారత ప్రధాని తనవంతు ప్రయత్నాలు చేస్తారని తనకు తెలుసన్నారు. అలాగే తన స్నేహితుడు మోడీని కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఆయన రష్యా వస్తే వర్తమాన అంశాలు, రెండు దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆయన దేశంలో పర్యటించాలని గతంలో ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే మోడీ పర్యటన ఉండనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News