Sunday, September 29, 2024

కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీలో జాప్యం.. ప్రభుత్వం వివరణ కోరిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయకుండా ఆపుతున్నారని కోర్టు ముందు విన్నవించారు.

ఈ నెల 27 వరకు చెక్కుల పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంపడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారంటున్నారని అధికారులను ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుదో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News