Monday, December 23, 2024

సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం జిల్లాలో మంత్రులు భట్టి, కోమటి రెడ్ది, తుమ్మల, పొంగులేటి పర్యటన

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. బి.జి కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంప్ హౌస్ ను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలకు నీరందనుంది. వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయరుకు నీరు పారుతున్నాయి. ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. మరోవైపు నేడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క , మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల కొత్తగూడెంలో పర్యటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News