Saturday, January 11, 2025

బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో అనేక స్కాంలు: ఎంఎల్ఎ వేముల వీరేశం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో అనేక స్కాంలు జరిగాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. అవినీతిపై విచారణ కమిషన్‌లను వేయగానే పోరాడే తత్వం ఉన్న మాజీ సిఎం కెసిఆర్ దొడ్డిదారిని ఎందుకు వెతుక్కుంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి వేముల వీరేశం కాంగ్రెస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని, అవసరమైతే జ్యుడీషియల్ విచారణ చేసుకోవాలని నాడు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారని వేముల గుర్తు చేశారు.

కెసిఆర్ డైరెక్షన్‌లో మాట్లాడిన జగదీశ్ రెడ్డి నేడు ఆ ఇద్దరు విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ చెప్పకుండానే జ్యుడీషయల్ విచారణ కోరారా అని జగదీశ్ రెడ్డిని వేముల వీరేశం ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అంధకారంలో నెట్టి ప్రయత్నం చేసిందని వేముల విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి 2014లో ఎంత ఆస్తి ఉంది, మంత్రి అయ్యాక ఎంత ఆస్తి ఉందని ఆయన ప్రశ్నించారు. ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ జగదీశ్ రెడ్డికి వేముల సవాల్ విసిరారు. అసత్యాలు మాట్లాడితే అవి నిజమైపోవన్నారు. రెండు రోజులుగా జగదీశ్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడకపోతే తనతో కలిసి బహిరంగ చర్చకు రావాలని వేముల వీరేశం సవాల్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News