Sunday, December 22, 2024

పంద్రాగస్టుకు ముందే రూ.2లక్షల రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: రైతుల కు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ రుణమాఫీ ఆగస్టు నెలలో కాదని అంతకన్నా ముందే చేసి చూపిస్తామని స్పష్టం చే శారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ని అమృత్ పథకం నిధుల ద్వారా చేపట్టే మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి ఇతర అభివృ ద్ధి పనులకు స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన స భలో ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ కా ర్యక్రమాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయం సేకరించి వి ధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారని దీని ద్వారా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిన కూడా ఇంటింటికి తాగు నీటి సరఫరా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

గత పదేళ్లు పాలించిన వారు రాష్ట్ర సంపదను దోపిడీ చేసి ఎవరికి పడితే వారికి పంచి 7 లక్షల కోట్ల అప్పు అప్పు చేసి పారిపోయారని విమర్శించారు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారిస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సరఫరాకు 150 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందని అదేవిధంగా నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి 150 కోట్లతో తాగునీరు అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం పట్టణానికి ఒకటే దారి ఉందని దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి గాను స్థల సేకరణ కూడా పూర్తయిందని చెప్పారు. ఆర్‌ఓబి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేశారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్వోబీల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానికంగా ఐటీ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వదు ఇవ్వదు అని ప్రచారం చేశారని తాము ఒకేసారి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. ఇప్పుడు రైతుకు రుణమాఫీ చేయరు చేయరని ప్రచారం చేస్తున్నారని ఇది బాధాకరమన్నారు. ఇది ఇందిరమ్మ ప్రజల ప్రభుత్వమని పేర్కొన్నారు. కావలసినంత స్థలం నీరు బొగ్గు అందుబాటులో ఉన్నందున రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఐటి హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 9000 కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు.

ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నిటిని తెప్పించుకున్నామని తెలిపారు. ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి ఏంటి ఏడాదిలో మూడు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. వీటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెప్పారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పారిస్తామన్నారు. 70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ ను అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News