మన తెలంగాణ/హైదరాబాద్ :ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులున్నారని సిఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. తన దగ్గర ఉన్న శాఖలను సమర్ధవంతంగా నిర్వహి స్తు న్నానని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నా రు. ప్రతిపక్షాలు పలు శాఖలకు మంత్రులు లేరని ఆరో పిస్తు న్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యా శాఖను తాను ఫుల్ టైమ్ చూస్తున్నానని. విద్యాశాఖ మీద ఎన్నో సమీక్షలు నిర్వహించానని తన ఆధ్వర్యంలో విద్యాశాఖ వి జయవంతంగా పరీక్షలు నిర్వహించిందని ఆయన చెప్పారు. మీడియాలో ఇష్టారాజ్యంగా కథనాలు వస్తున్నాయని మీ పాటి కి మీరే శాఖలు కూడా కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. రా జకీయ పార్టీలు నిర్వహించే టివిలు, పత్రికలు మాత్రమే శాఖల కు మంత్రులు లేరని రాస్తున్నారని సిఎం రేవంత్ చెప్పారు. ఒక నిర్ధిష్టమైన ప్రణాళికా ప్రకారం ముందుకెళ్తున్నామని ముఖ్య మంత్రి రేవంత్ వివరించారు. గురువారం ఢిల్లీలో జరిగిన వి లే కరుల సమావేశంలో సిఎం రేవంత్ మాట్లాడుతూ అన్ని శా ఖలకు సమర్ధవంతమైన మంత్రులున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నా రో లేదో చూడాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.
గతం లో కెసిఆర్ ఒక సందర్భంలో ఏ శాఖకు మంత్రి లేకుండా ఉన్న ప్పుడు ఎవరైనా ప్రశ్నించారా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులను క లుస్తున్నారని ఆయన తెలిపారు. ఆరు సంక్షేమ పథకాలను అ మలు చేయడమే మా ధ్యేయమని సిఎం రేవంత్‌రెడ్డి పున రుద్ఘాటించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణ యించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిధు ల కేటాయింపు కోసం కేంద్రమంత్రులను కలుస్తున్నామని, త్వ రలో ప్రధాని, మరికొంత మంది కేంద్రమంత్రులను కలు స్తా మ ని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. స్వార్థం, కుటుంబ పాలన వల్లే బిఆర్‌ఎస్ పతనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదని సిఎం రేవంత్ అన్నారు.
ఫిరాయింపులకు పునాది వేసిం దే కెసిఆర్ అని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ మతి తప్పి మా ట్లాడుతున్నారని అమరవీరుల
స్థూపం దగ్గరకు వచ్చి కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరిగా కెసిఆర్ నీతులు చెబుతున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నది ఎవరు? అని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. నెలరోజులు గడవకముందే తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కెసిఆర్ చెప్పారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కెటిఆర్, హరీశ్‌రావులు కూడా అన్నారని, కెటిఆర్, హరీశ్ మాటలకు అప్పట్లో బిజెపి వంతపాడిందని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేటు వరకు కూడా ఎమ్మెల్యేలను కెసిఆర్ రానివ్వలేదు..?
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బిఆర్‌ఎస్ తమ ఓట్లను గంపగుత్తగా బిజెపికి వేయించిందని సిఎం రేవంత్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటింగ్ శాతం 16 శాతానికి తగ్గిందని అయినా కెసిఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఎంపి ఎన్నికల్లో బిజెపిని కెసిఆర్ గెలిపించారని, కంచుకోటగా చెప్పుకునే మెదక్‌లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచిందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.మొన్నటివరకు గేటు వరకు కూడా రానీయ్యని ఎమ్మెల్యేలను ఇప్పుడు పిలిచి భోజనాలు పెడుతున్నారని సిఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు మమ్మల్ని ఏనాడైనా పిలిచారా?, అయినా తాము ప్రతిపక్ష నేతకు గౌరవం ఇస్తూ పిలిచామని సిఎం రేవంత్ అన్నారు. అవతరణ వేడుకలకు కెసిఆర్ ఎందుకు రాలేదని సిఎం రేవంత్ నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తప్పక నెరవేరుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా పాలన చేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు.
పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా కలిసి పనిచేస్తా
నా పిసిసి అధ్యక్ష పదవీకాలం ముగిసిందని, అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్త పిసిసి చీఫ్‌ను నియమించాలని హై కమాండ్‌కు చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని సిఎం రేవంత్ తెలిపారు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని, తాను పిసిసిగా పదవిలో ఉన్నప్పుడే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామని సిఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
జీవన్ రెడ్డి అనుభవాలను వినియోగించుకుంటాం
జీవన్ రెడ్డి అనుభవాలను వినియోగించుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలనలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని సిఎం రేవంత్ అన్నారు. జీవన్ రెడ్డి చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పట్ల జీవన్ రెడ్డికి ఉన్న నిబద్ధత వారికి అర్థం కాదన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారన్నారు. సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి ఎంతో కృషి చేశారని సిఎం రేవంత్ చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామని సిఎం రేవంత్ హామీనిచ్చారు. జగిత్యాల నియోజకవర్గాంతో పాటు రైతుల కోసం జీవన్ రెడ్డి కొట్లాడారని సిఎం అన్నారు. రైతురుణమాఫీ, రైతుబంధు విషయంలోనూ జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాం
రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించామని ఎపిలో 40 నుంచి -50 మంది అధికారులను తొలగించాల్సి వచ్చిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై కేంద్రంతో పాటు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసు ఒక్కటీ పెట్టేలేదని సిఎం క్లారిటీ ఇచ్చారు.
ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటాం
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాదించలేదన్నారు. ఎపి, తెలంగాణ వివాదాల గురించి సిఎం రేవంత్ స్పందిస్తూ ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని, బిఆర్‌ఎస్‌ను కాపాడేందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు.