Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(28-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది.

వృషభం – రాబడి పెరుగుతుంది నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి.

మిథునం – మొండి బాకీలు వసూలు అవుతాయి.అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం.

కర్కాటకం – వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది.

సింహం – స్వప్రయోజనాల కొరకు అభివృద్ధి కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. ఆత్మీయులకు కీలక సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి.

కన్య – వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు, స్థిరాస్తుల వ్యవహారాలు. అమ్మకాలు అనుకూల వాతావరణంలో ఉంటాయి.వ్యవహారాలను కొంతవరకు సానుకూల పరచుకోగలుగుతారు.

తుల – శుభప్రదమైన ప్రసంగాలు,చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి విషయము మొదట కొంత నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

వృశ్చికం – తనఖా వస్తువులను విడిపిస్తారు. కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రజ్ఞాపాట వాళ్లను కనబరుస్తారు.

ధనుస్సు – ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు.  శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.

మకరం – కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు.వాటిని కొంతవరకు అమలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని అనుభవ పూర్వకంగా గ్రహిస్తారు.

కుంభం – మీకు రావలసిన బకాయిలు మొదలైన ఆర్థిక వ్యవహారాల పైన దృష్టి కేంద్రీకరిస్తారు. సున్నితమైన వ్యవహారాలను వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోగలుగుతారు.

మీనం – ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు భంగపడతారు. శారీరక శ్రమ మానసిక ఒత్తిడి మాత్రం తప్పవు. స్వల్ప ధన లాభం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News