Sunday, December 22, 2024

భర్త ఆ పని చేస్తున్నాడని… విడాకులు ఇచ్చిన భార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విడాకులు తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం లేదని, ట్రైమ్ కు భోజనం పెడతాలేదని విడాకులు తీసుకున్న సంఘటనలు కొకొల్లాలు ఉన్నాయి. తాజాగా ఊరగాయ పచ్చడి డబ్బాలపై భర్త మూతలు బిగుతుగా పెడుతుండడంతో తాను తీయలేకపోతున్నాని అతడికి భార్య విడాకులు ఇచ్చింది. రెడ్డిట్ అనే సోషల్ మీడియాలో భార్య పోస్టు చేసింది. ఊరవేసిన అవకాయ, నిమ్మకాయ పచ్చడి డబ్బాల మూతలను భర్త గట్టిగా మూసి పెడుతున్నాడు. ఈ మూతలు తీయడానికి భార్య ప్రయత్నించిన ఓపెన్ కాకపోవడంతో పక్కింటి వాళ్లు సహాయం తీసుకునేది. ఇలా పలుమార్లు మూతల విషయంలో దంపతులు మధ్య గొడవల జరిగాయి. భర్తకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టుగా అతడికి నోటీసులు పంపించింది. భర్త క్షమాపణలు చెప్పిన కూడా భార్య వినలేదు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న విషయానికే విడాకులు తీసుకుంటావా? అని నెటిజన్లు భార్యపై కామెంట్లు చేస్తున్నారు. పచ్చడి డబ్బాలకు మూత బిగుతుగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News