Monday, December 23, 2024

పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సిఎం చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. పోలవరం రాష్ట్రాభివృద్ధికి జీవనాడి అని అన్నారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు గెలవాలని.. రాష్ట్రం నిలబడాలన్నారు. మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు అన్నారు. వెబ్‌సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని సీఎం చంద్రబాబు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News