మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ బి ఫాం మీద పోటీ చేసిన వాళ్ల కే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశా రు. కొత్త పిసిసి చీఫ్‌కు సంబంధించి సామాజి క సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన వెల్లడించా రు. పిసిసి అధ్యక్షుడు, కేబినెట్ విస్తరణ ఒకేసారి ఫైనల్ అవుతుందని సిఎం రేవంత్ తెలిపారు. పిసిసి చీఫ్‌గా తాను రెండు ఎన్నికల ను పూర్తి చేశానని, జులై 7వ తేదీతో మూడేళ్లు పూర్తి కానుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. వాటి వడ్డీలు ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్ల వర కు ప్రభుత్వానికి ఆదా అవుతుందని ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల పోస్టింగ్స్‌లకు సంబంధించి తాము రూల్స్ బ్రేక్ చే యాలని అనుకోవడం లేదన్నారు. కెసిఆర్ చే సిన తప్పులు చేయబోమని సిఎం రేవంత్ స్ప ష్టం చేశారు.తెలంగాణలో కరెంట్ కోతలు లే వని, సర్ ప్లస్ పవర్ కొంటున్నామని సిఎం రేవంత్ వెల్లడించారు. విద్యుత్ కొర త లేదని కేవలం పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని రేవంత్ తెలిపారు.
రుణమాఫీపై మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు సిఎం రేవం త్ తెలిపారు. పంట తరువాయి 6లో
రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, పాస్‌బుక్ ఉంటే చాలని ఆయన తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమేనని సిఎం పేర్కొన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉం టుందని ఆయన స్పష్టం చేశారు. పంట రుణాలు మాత్ర మే మాఫీ అవుతాయని, బంగారంపై తీసుకున్న రుణాలకు కాదని సిఎం స్పష్టం చేశారు. మహిళల ఉచిత బస్సు పథకంతో ఆర్టీసి గట్టున పడిందని ఆయన తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం నెలకు రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఆర్టీసి నిర్వహణలో వచ్చే నష్టాలు తగ్గిపోయాయన్నారు. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసి లాభాలతో నడుస్తుందన్నారు. ఆర్టీసికి సంబంధించిన ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు.
రైతుబంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్‌కు వ్యవసాయ శాఖ నోట్
మరోవైపు రైతుబంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్‌కు వ్యవసాయ శాఖ నోట్ అందజేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో12 విడతల్లో కలిపి రూ.26 వేల 5వందల కోట్లు ప్రజాధనం దుబారా అయినట్లు గుర్తించిందన్నారు. హైవేలు, వెంచర్లు, బీడు భూములకు కూడా గత ఆరేళ్లలో రూ.18 వేల కోట్ల రూపాయలు చెల్లించారని సిఎం రేవంత్ తెలిపారు. గత బిఆర్‌ఎస్ హయాంలో ప్రతి విడతలో రూ.2 వేల కోట్లకు పైగా దుర్వినియోగం అయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్
వాస్తవాలకు అనుగుణంగా మాత్రమే బడ్జెట్ ఉండాలని అధికారులకు స్పష్టంగా చెప్పామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలు వద్దని అధికారులను సూచించామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు రేవంత్ తెలిపారు. ఖజానాకు భారం ఉన్న సంక్షేమంపై దృ ష్టి పెడుతున్నామని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ ప్రథమ లక్ష్యమని, మిగిలిన అంశాలకు సంబంధించి దృష్టి తర్వాత పెడతామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు
మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తరవాత ఈ కమిషన్‌ను నియమిస్తామన్నారు. బిసి కమిషన్ పదవీకాలం ఆగస్టులో పూర్తవుతుందని, కొత్తవారిని నియమించిన తరవాత కులగణన చేపడుతామన్నారు.
ప్రతి నెల రూ.7వేల కోట్లు…
కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందు కు తీసుకొస్తామని సిఎం రేవంత్ తెలిపారు. చర్చల తరవాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతామన్నారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, మరో లక్ష కోట్ల వరకు పెండింగ్ బైల్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. నెలకు రూ.7 వేల కోట్లు అప్పులు కడుతున్నామని, రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ.6,500 కోట్లు కట్టేవారమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. ఇందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. 7 నుంచి 11శాతం వడ్డీ వరకు రుణా లు తీసుకువచ్చామని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించాం
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించామని సిఎం రేవంత్ తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్రమంత్రులు కేంద్రమంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశామన్నారు. బడ్జెట్‌కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
మహిళకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఓకే
మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలన్నది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. పిసిసి రేసులో ఎవరైనా ఉండొచ్చు. ఈ ఎంపికలో సామాజిక న్యాయం అనేది తప్పనిసరిగా ఉంటుందని, బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబిసిల్లో ఎవరినైనా ఎంపిక చేయవచ్చని, మహిళకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సిఎం చెప్పారు.
అన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులు….
ఫిరాయింపులు తెలంగాణలో మాత్రమే కాదని అన్ని చోట్ల ఉందని సిఎం రేవంత్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని ఆయన పేర్కొన్నారు. నలుగురు టిడిపి రాజ్యసభ ఎంపిలతో ఏకంగా పార్టీనే బిజెపి విలీనం చేసుకుందన్నారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదని, అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి తప్ప సంపన్నులకు కాదని ఆయన అన్నారు. మోడీ పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించరని, కానీ, మహిళలు, రైతులకు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు.