ముంబై: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా..కాదు..ఫార్మాట్ ఏదైనా క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఐపిఎల్‌తో సహా వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ వంటి మెగా టోర్నమెంట్‌లను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.
అయితే వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టి20 వరల్డ్‌కప్‌పై మాత్రం అభిమానులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. భారత్ ఫైనల్‌కు చేరుకున్నా అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లో క్రికెట్ ప్రేమీకులు టీమిండియాకు అండగా నిలిచారు.
కానీ ఈసారి టి20 వరల్డ్‌కప్‌లో భారత్ అసాధారణ ఆటతో ఫైనల్‌కు చేరుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశంలోని ఏ నగరంలో కూడా టీమిండియాకు మద్దతుగా ఎక్కడా బ్యానర్లు కనిపించడం లేదు. దీంతో ఈసారి వరల్డ్‌కప్ చాలా సప్పగా సాగిందనే చెప్పాలి.