Monday, December 23, 2024

ఢిల్లీ మంత్రి ఆతిశీ పై పరువునష్టం కేసు

- Advertisement -
- Advertisement -

ఆమ్‌ఆద్మీ పార్టీ మహిళానేత , ఢిల్లీ మంత్రిఆతిశీపై శనివారం పరువునష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణ జులై 23న ప్రారంభమవుతుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిఎం కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం మంత్రి ఆతిశీ ఓ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఒక్కొక్క ఎమ్‌ఎల్‌ఎకు రూ. 25 కోట్లు ఆఫర్ చేస్తూ నేతలను కొనేందుకు ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్‌ఎల్‌ఎలకు డబ్బులు ఆశ చూపినట్టుగా తప్పుడు ఆరోపణలు చేసి బీజేపీ ప్రతిష్ఠను దిగజార్చారని, ఆప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రవీణ్ శంకర్ కపూర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆతిశీ మళ్లీ ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని, తనను బీజేపీలో చేరాలని కోరారని, పార్టీ మారకపోతే ఈడీ తనను ఒక నెలలోగా అరెస్ట్ చేస్తుందని బెదిరించారని ఆతిశీ ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ పరువునష్ట కింద నోటీస్‌లు పంపింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News