Thursday, April 17, 2025

జలపాతంలో పడి ఆరుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

ముంబయి: జలపాతంలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గల్లంతైన సంఘటన మహారాష్ట్ర లోనావాలా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ కుటుంబంలో ఆరుగురు సభ్యులు సరదా కోసం విహారయాత్రకు వెళ్లారు. లోనావాలాలోని ఓ డ్యామ్ వద్దకు జలపాతాన్ని వారు వీక్షిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆరుగురు జలపాతంలో పడిపోయారు. నీటిలో కొట్టుకొనిపోయి రిజర్వాయర్‌లో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో గాలించగా మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. మిగితా ముగ్గురు కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News