Monday, December 23, 2024

జులై 18 వరకు సూరజ్ రేవణ్ణకు జుడిషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఇద్దరు పురుషులపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంఎల్‌సి సూరజ్ రేవణ్ణను జులై 18 వరకు జుడిషియల్ కస్టడీ విధిస్తూ బెంగళూరు కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న సిఐ కస్టడీకి జులై 3 వరకు సూరజ్ రేవణ్ణను అప్పగిస్తూ జులై 1న స్థానిక 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. గత వారం సూరజ్‌కు సిఐడి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆయన డిఎన్‌ఎ శాంపిల్స్‌ను కూడా సిఐడి సేకరించింది. జూన్ 23న అరెస్టయిన సూరజ్ రేవణ్ణకు పుంసత్వ పరీక్షను కూడా సిఐడి నిర్వహించింది. సూరజ్ రేవణ్ణ తమపై లైంగిక దాడి జరిపినట్లు ఆరోపించిన ఇద్దరు బాధితుల నుంచి కూడా సిఐడి డిఎన్‌ఎ శాంపిల్స్ సేకరించింది.

మొదటి కేసుకు సుకు సంబంధించిన బాధితుడి ఫిర్యాదు ప్రకారం జూన్ 16న తతను గన్నికాడలోని ఫామ్‌హౌస్‌కు పిలిపించిన సూరజ్ తనపై లైంగిక దాడి జరపడంతోపాటు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. రెండవ కేసుకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు ప్రకారం మూడేళ్ల క్రితం కొవిడ్ కాలంలో సూరజ్ రేవణ్ణ లైంగిక దాడి జరిపాడు. మహిళలపై లైంగిక దాడి జరపడంతోపాటు అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన జెడిఎస్ మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సూరజ్ అన్న. వీరిద్దరూ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవలు. వీరి తల్లిదండ్రులు హెచ్‌డి రేవణ్ణ, భవానీ రేవణ్ణ కూడా ఈ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News