రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఎడి’ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్ కు చేరువలోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ చిత్రంపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యాడు.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించిన ‘సలార్ – ది సీజ్ ఫైర్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అయిన ‘సలార్ – శౌర్యంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఈ పాన్ ఇండియా స్టార్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ ఆగస్టు 10 నుంచి చేరనున్నాడని తెలిసింది. ఈ సినిమాతో పాటు ‘రాజా సాబ్’ చిత్ర షూటింగ్ లోనూ ప్రభాస్ పాల్గొంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.