Monday, December 23, 2024

హథ్రాస్ సందర్శించనున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

లక్నో: హథ్రాస్ తొక్కిసలాటలో అనేక మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హథ్రాస్ సందర్శించి, బాధితులను ఓదార్చనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్ తెలిపారు. ‘‘లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి ప్రజలతో మాట్లాడతారు’’ అన్నారు.

ఇదిలావుండగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ , రిటైర్డ్ హైకోర్టు జడ్జీ బ్రిజేశ్ కుమార్ శ్రీవాత్సవ, ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు హేమంత్ రావు, భవేశ్ కుమార్ సింగ్ తో న్యాయ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా ఆ కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News