Friday, December 20, 2024

నకిలీ మందుల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నకిలీమందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్, పేట్ బాషీరాబాద్ పోలీసులు దాడి చేశారు. 50 లక్షల విలువ చేసే నకీలీ మందులు, మిషనరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్(42), రామక్రిష్ణ(40) నిందితులను అరెస్టు చేశామని మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి  డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా నిహల్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News