Sunday, December 22, 2024

గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి రవాణా, విక్రయిస్తున్న ఎనిమిది మంది నిందితులను హైదరాబాద్ పోలీసులు, హెచ్‌న్యూ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 155కిలోల గంజాయి, కారు, ఆటో, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.61లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం….ఒడిషా రాష్ట్రానికి చెందిన మానాజిత్ ధాలి అలియాస్ జిటూ గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఒడిషా రాష్ట్రం, మల్కాన్‌గిరికి చెందిన అనిల్ ధనాజీ ఘంటే, సుశాంత్ మిస్ట్రీ, సుమంత్ మండల్, ప్రసాంత్‌జిత్ మిస్ట్రీ గంజాయి రవాణా చేస్తున్నారు. ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన చిన్నా రాథోడ్ గోవింద్ గంజాయి రవాణా చేస్తున్నాడు, నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన ఎస్.లకన్ సింగ్ అలియాస్ లకన్ అలియాస్ గోరు తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు పలువురు విక్రేతలకు అమ్ముతున్నాడు.

నిందితుడిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి, రౌడీషీట్ ఉంది, రెండుసార్లు పోలీసులు పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన దేవరాజ్ సింగ్ అలియాస్ కాలు గంజాయి విక్రయిస్తున్నాడు. నిందితులు అందరు కలిసి ఒడిషారాష్ట్రం నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, డానియల్, శేఖర్‌రెడ్డి, రాంబాబు, వెంకటేశ్వర్లు,ఎస్సై వెంకటరాములు కలిసి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News