ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ విజ్ఞప్తితో ఆయన ఈ వీడియో చేశారు. సైబర్ నేరస్థుల బారిన పడినపుడు అధైర్యపడకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని ఈ వీడియో ద్వారా జూ.ఎన్టీఆర్ యువతను హెచ్చరించారు. ఆన్ లైన్ లో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ధైర్యంగా ఉండాలని, సైబర్ నేరస్థుల బారి నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ యువకుడితో స్నేహం పెంచుకుని, ప్రేమలో పడ్డ ఓ యువతి ఎలాంటి కష్టం ఎదుర్కొందనేది జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలో చూపించారు. యువత అవగాహన కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది.