Friday, November 22, 2024

హత్రాస్ ఘటనలో ఆరుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హత్రాస్(యుపి): హత్రాస్ జిల్లాలో 121 మంది భక్తులను బలిగొన్న తొక్కిసలాట ఘటనకు సంబధించి సత్సంగ్ నిర్వాహక కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొన్న సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరితోపాటు ఆధ్యాత్మిక గురువు భోలే బాబాను దర్యాప్తు సందర్భంగా ప్రశ్నిస్తామని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.

గత మంగళవారం హత్రాస్‌లో బాబా భోలే నిర్వహించిన సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగి 121 మంది భక్తులు మరణించారు. వీరిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం పూర్తయిందని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం తెలిపారు. అరెస్టయిన ఆరుగురు సత్సంగ్‌లో సేవకులుగా(కార్యకర్తలుగా) పనిచేసినట్లు అలీగఢ్ రేంజ్ ఐజి షలాభ్ మాథుర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News