Monday, December 23, 2024

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా కేశవరావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఎంపీ కేశవరావుకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సిఎం చెప్పారు. ఢిల్లీ పర్యటలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సిఎం ఢిల్లీలోని కేకే నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి కేశవరావు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగు రోడ్డుపై దృష్టి పెట్టామని, ఎటువంటి గందరగోళం లేకుండా 11 వేలకుపైగా టీచర్ల బదిలీలు చేశామని అన్నారు.

కాంగ్రెస్ నా సొంత ఇల్లు : కేకే
కాంగ్రెస్ తన సొంత ఇల్లు అని, తాను ఆ పార్టీ మనిషిని అని ఈ సందర్భంగా కేకే పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పాలన ఇప్పుడు ప్రజస్వామ్యబద్దంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేమని, ఆరు నెలల్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చూశామని తెలిపారు. ఫ్యామిలీ పబ్లిసిటీ అనేది గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారని విమర్శించారు. నైతిక విలువలతో తాను రాజీనామా చేశానని, ఇదే విషయాన్ని రాజీనామా సమయంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ఖు కూడా చెప్పాను అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News