Monday, December 23, 2024

ఎంఎల్ఎ సాయంతో తెలంగాణ తల్లి విగ్రహన్ని కూల్చేందుకు విఫలయత్నం

- Advertisement -
- Advertisement -

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహన్ని కూల్చేందుకు కాంగ్రెస్ లీడర్స్ విఫలయత్నం చేసిన ఘటన పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం ఎస్సి కాలనీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. బిఆర్ఎస్ మండల కార్యదర్శి చింత రవి తెలంగాణ తల్లి విగ్రహం కాలనీ లో ఏర్పాటు చేశాడు. అయితే అది తట్టుకోలేని కొందరు కాంగ్రెస్ లీడర్స్ ఎంఎల్ఎ యశ్వస్వినీరెడ్డి ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి లేదని విగ్రహాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారు. అయితే స్థానిక మహిళలు గ్రామ పంచాయతీ సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.లంగాణ తల్లి విగ్రహంతో రాజకీయాలు తగవని, కూల్చివేత ఆపాలని గొడవకు దిగడంతో ఎట్టకేలకు కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News