Monday, December 23, 2024

కెసిఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అధికారిక సైట్లో బిఆర్ఎస్ పోస్టులు పెట్టింది. దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క…బిఆర్ఎస్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు.

తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంపై మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇప్పటికే పవర్ కమిషన్ నోటీసులు పట్టించుకోని కెసిఆర్, సీతక్క లీగల్ నోటీసులకు స్పందిస్తారా? అన్నది కుతూహలం కలిగిస్తోంది.

KCR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News