Monday, December 23, 2024

బాలికపై లైంగిక దాడి కేసు: జులై 15న ఎడియూరప్ప కోర్టుకు రావాలి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు దాఖలైన కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పను జులై 15న ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ బెంగళూరు కోర్టు శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి జూన్ 27న బిజెపి సీనియర్ నాయకుడైన ఎడియూరప్పపై కర్నాటక సిఐడి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. తనపై గతంలో జరిగిన లైంగిక దాడి కేసులో సాయం కోరుతూ 2024 ఫిబ్రవరి 2న మైనర్ బాలిక తన తల్లితో కలసి ఎడియూరప్ప నివాసానికి రాగా ఆ 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు సిఐడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది.

ఆ బాలిక ఏడేళ్ల వయసులో ఉండగా ఆమె బంధువు ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విషయంలో తనకు సాయం చేయాలని కోరుతూ ఆ బాలిక ఎడియూరప్పను కోరింది. ఆ బాలికను తన గదిలోకి తీసుకెళ్లిన ఎడియూరప్ప తలుపు గడియ పెట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు చార్జిషీట్‌లో ఆరోపించారు. ఆమె ప్రతిఘటించగా కొంత డబ్బు చేతిలో పెట్టి ఆయన తలుపు గడియ తీశారు. వారి మధ్య జరిగిన సంవాదాన్ని బాలిక తల్లి తన ఐఫోన్‌లో రికార్డు చేయగా ఇప్పుడు అదే ఈ కేసులో కీలక సాక్షంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News