Tuesday, December 24, 2024

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపి ధర్మపురి అరవింద్ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపి, బిజెపి నాయకులు ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7వ తేదీన దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సిఎంను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని సిఎం నివాసంలో రేవంత్‌ను కలిసి ఆహ్వానించారు.

ఇటీవల పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతికి ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి డిఎస్ సతీమణి విజయలక్ష్మికి సంతాప లేఖ రాశారు. ఈ లేఖలపై ఎంపి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబం పట్ల సానుభూతి తెలిపినందుకు తాను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News