Friday, January 10, 2025

బోనమెత్తేందుకు భాగ్యనగరం సిద్ధం

- Advertisement -
- Advertisement -

గోల్కొండలో ఆలయ మెట్లకు భక్తులు బొట్లు పెట్టి పూజలు
జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో జాతర ఆరంభం
ఈ నెల 7 నుంచి బోనాలు షురూ

విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత, తెలంగాణ సంప్రదాయం, భక్తి శ్రద్దలతో కూడిన ఆషాడ మాస బోనాల జాతరకు భాగ్య నగరం సిద్ధమైంది. ఈ నెల 7 ఆదివారం గో ల్కొండ ఖిల్లా నుంచి నుంచి బోనాల జాతరకు శ్రీకారం జరుగుతుంది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గోల్కొండలోని జగదాంబికా, మహంకాళి అమ్మవార్లకు అర్చకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమావాస్య రోజు కావడంతో మెట్లకు బొట్లు పెట్టి భక్తులు కూడా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి యేడాది ఆషాఢ మాసం అమావాస్య రోజున అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఆలయ మెట్లకు బొట్లు పెట్టడం ఆనవాయి తీ. మెట్లకు బొట్లు పెట్టేందుకు భక్తులు భారీ సం ఖ్యలో తరలివచ్చారు. దీంతో బోనాల సందడి షు రూ అయ్యింది. గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా గోల్కోండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ఆరంభం అవుతుంది.

ఇప్పటికే బోనాల పండుగ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బోనాల జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆ తర్వాత పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో బోనాలను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. హైదరాబాదు, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు.

బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం. అమ్మవారికి భక్తిశ్రద్దలతో వండిన ఆహారాన్ని ఆరగింపు చేయ డం లేదా బోనం సమర్పించడం భక్తుల ఆనవాయితీ. తమ కష్టాలు తీర్చాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులు మొక్కులు మొక్కుకుని వాటిని తీర్చేందుకు బోనాల పండుగ రోజు ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. అనాదిగా ఇది పల్లె ప్రజల పండగ. ఓ రకంగా ప్రకృతిని ప్రేమించే పండగగా భావిస్తారు.

ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వెళతారు
ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని పెద్ద కాలం నుంచి ఉన్న నమ్మకం. ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ స్వంత కుమార్తె తమ ఇంటికి వచ్చిన భావనతో, ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారని చెబుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణం గా దున్నపోతులకు బదులు కోళ్లను బలి ఇవ్వడం ఇప్పుడు ఆనవాయి తీగా మారింది. బోనాలను తీసుకెళ్లే మహిళలకు, అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మా సంలో మొదలై శ్రావణ మాసం, బాద్రపద మా సంతో ఇది ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News