Saturday, October 5, 2024

‘కుబేర’ మూవీ నుంచి రష్మిక ఫస్ట్లుక్ గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ ’కుబేర’ ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వుంది. మేకర్స్ ఇప్పటికే ఈ ఇద్దరి సూపర్‌స్టార్‌ల క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది.

శుక్రవారం మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఆమె ఎక్స్‌ట్రార్డినరీ, డిఫరెంట్ అవతార్‌లో కనిపించి ఎంతగానో ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. ఆకట్టుకునే విజువల్స్‌తో శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. గ్లింప్స్ వీడియోలో డబ్బుని తవ్వి తీసున్న రష్మిక క్యారెక్టర్‌ని చూపించి సినిమాపై ఆసక్తిని పెంచారు.

దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేసింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News