- Advertisement -
హైదరాబాద్ నిమ్స్ వైద్యురాలు ప్రొఫెసర్ ప్రాచీ కర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. చికిత్స పొందుతూ వైద్యురాలు మృతి చెందారు.
అనస్తీషియా అధిక మోతాదులో తీసుకోవడంతో మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా, నిమ్స్ ఆస్పత్రిలో అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా ప్రాచీకర్ పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -