Monday, December 23, 2024

రూ. 3.5 కోట్ల ఓపెనింగ్ సినిమాకు రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తున్న నటులు

- Advertisement -
- Advertisement -

ముంబై:  బాలీవుడ్ సినిమా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ ప్రముఖ హిందీ సినీ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ సంక్షోభంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. థియేటరికల్ సక్సెస్ విషయాన్ని తరచి చూసుకోవలసిన తరుణం ఇదన్నారు. ‘‘నేడు ప్రేక్షకుల అభిరుచులు మారాయి. వారు ఓ తరహా సినిమాలను కోరుకుంటున్నారు. వారు  కోరుకున్న రీతిలో సినిమా రూపొందిస్తే అది ఏ,బి,సి సెంటర్లలో ఆడగలదు. మల్టీప్లెక్సెస్ లో ఆడడం ఒకటే సరిపోదు’’ అన్నారు. యూట్యూబ్ ఛానెల్ జర్నలిస్ట్ ఫయే డిసౌజా తో మాటామంతీ సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.

‘‘నేడు సినిమా నిర్మాణం ఖర్చులు పెరిగిపోయాయి. పైగా ద్రవ్యోల్బణం కూడా ఉంది. హిందీ సినీ రంగంలో పేరు మోసిన 10 మంది నటులు సూర్యచంద్రులు కావాలన్న రీతిలో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కనుక వారు కోరినట్లు పెద్ద మొత్తం చెల్లించక తప్పడం లేదు. ఆ తర్వాత మార్కెటింగ్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. తొలి రోజున రూ. 3.5 కోట్ల ఓపెనింగ్ ఉండే సినిమా స్టార్లు రూ. 35 కోట్లు కావాలని అంటున్నారు. ఈ లెక్క ఎలా పనిచేయగలదు? అన్నింటినీ మీరెలా మేనేజ్ చేయగలరు? మీరు సినిమా రూపొందించాలి, కంటెంట్ తయారు చేసుకోవాలి, మీ సంస్థను పోషించాలి. అనేక విషయాలు చూసుకున్నట్లయితే సినిమా నిర్మాణం నిలదొక్కుకోవడంలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

‘‘ హిందీ సినిమా విషయానికి వస్తే, జవాన్, పఠాన్ సినిమాలు విజయం సాధించాయి. అందుకని కేవలం యాక్షన్ సినిమాలే తయారుచేయాలా? మన పరిస్థితి ఎలా తయారయిందంటే తల లేని కోడి ఎటుపడితే అటు పరుగులు తీస్తున్నట్లు ఉంది. గుంపు మనస్తత్వం తో కన్విక్షన్ పూర్తిగా దెబ్బతిన్నది. కొంత మంది ప్రేక్షకులు మన సినిమాలు భారతీయంగా ఉండాలనే కోరుకుంటున్నారు. విమర్శకులు సినిమా చూస్తే ఆనందం కలుగాలంటున్నారు ’’ అని తెలిపారు. ప్రస్తుతం కరణ్ జోహార్ ‘కిల్’ అనే సినిమా ప్రొడక్షన్ లో ఉన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News