Monday, November 18, 2024

రెండు కమిటీలతో ముందడుగు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఏమన్నది..

ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని
స్థిరాస్తులన్నీ(లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, సిఐడి ఆఫీస్,
తదితర భవనాలు) తెలంగాణకే చెందుతాయి,
ఎపికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ నిరాకరణ
విద్యుత్ బకాయిల చెల్లింపునకు ఒప్పుకోని
తెలంగాణ..మాకే ఎపి నుంచి బకాయిలు రావాలని
వాదన ఐదు గ్రామాల అప్పగింతకు కేంద్ర
హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం కృష్ణా
జలాల్లో 558టిఎంసిలు కేటాయించాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వాలి

ఎపి ఏం చెప్పింది

ఉద్యోగుల విభజన అంశాలు, షెడ్యూల్ 9,10 సంస్థలు,
నిధులు, ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ నుంచి రూ.7వేల కోట్ల విద్యుత్
బకాయిలు చెల్లించాలి 10వ షెడ్యూల్‌లోని
142సంస్థల పంపిణీ, రాజ్‌భవన్, హైకోర్టు,
లోకాయుక్త వంటి రాజ్యాంగసంస్థల నిర్వహణ
బకాయిలపై వివాదాలను పరిష్కరించుకోవాలి
హైదరాబాద్‌లోని పలు స్థిరాస్తులను
ఆంధ్రప్రదేశ్‌కు అందజేయాలి

చర్చకు వచ్చిన ప్రధానాంశాలు
విభజన చట్టంలో పేర్కొన్న, పేర్కొనని
సంస్థల ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
అంశాలు పెండింగ్ విద్యుత్ బిల్లులు
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి
రాష్ట్రంలో నిర్మించిన 15 ప్రాజెక్టుల
అప్పుల పంపకాలు ఉమ్మడి సంస్థలకు
చేసిన ఖర్చుకు చెల్లింపులు
హైదరాబాద్‌లో ఉన్న మూడు
భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే
అంశం లేబర్‌సెస్ పంపకాలు
ఉద్యోగుల విభజన అంశాలు

విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల నిర్ణయం
నిర్ణీత వ్యవధిలో తేల్చాలని నిర్ణయం రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు
భంగం కలుగొద్దని ఏకాభిప్రాయం సామరస్యపూర్వక వాతావరణంలో
సిఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు బృందాల విస్తృత చర్చలు
కమిటీలతో పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీలు
విభజన వివాదాలపై సుమారు రెండు గంటల పాటు లోతైన చర్చ
చంద్రబాబుకు కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించిన రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్ : విభజన సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక క మిటీ, ఉన్నతస్థాయి అధికారులతో మరో కమిటీని వే యాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. వీటితో కూడా విభజన వివాదాలకు పరిష్కారం దొరకకపోతే రెండు రాష్ట్రాల సిఎంల స్థాయిలో భేటీలో నిర్వహించాలని తేల్చాయి. శనివారం సా యంత్రం ఇక్కడి ప్రజాభవన్‌లో తెలంగాణ, ఎపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుల నాయకత్వంలో సుమారు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రు లు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో విభజన అంశాలపై లోతుగా చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వకంగా చర్చ కొనసాగగా, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. ఎపి సిఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో అడుగుపెట్టగానే ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

పలు అంశాలపై ప్రధానంగా చర్చ

పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆరు గంటల పది నిమిషాలకు ప్రజాభవన్‌లో ప్రారంభమయ్యింది. విభజన చట్టంలో పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వారిద్ద రూ సుమారు రెండుగంటల పాటు చర్చించారు. వీటి లో పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలను సిఎంలు తీసుకున్నారు. ఈ భేటీలో భాగంగా 10 కీలక అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చ ర్చించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజ నాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సిఎంలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే న్యాయపరమైన చిక్కులకు సం బంధించి అధికారులతో సిఎంలు చర్చించారు. షెడ్యూ ల్ 10లోని పలు అంశాలపై ప్రధానంగా చర్చ జరగ్గా, నిర్ణీత వ్యవధిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఏకాభిప్రాయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు.

Revanth reddy meets chandrababu naidu

ఐదు గ్రామాల వ్యవహారంపై లేఖ

విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై ముఖ్యమంత్రులు చర్చించారు. హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు ఎపికి ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని స్థిరాస్తులు ఎపికి ఇవ్వడానికి సిఎం రేవంత్ నిరాకరించినట్టుగా తెలిసింది. విద్యుత్ బకాయిలపై ఎపి ప్రస్తావించగా బకాయిలు చెల్లించేది లేదని తెలంగాణ అధికారులు వెల్లడించి నట్టుగా సమాచారం. ఇక ఎపి ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ అధికారులు పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ బకాయి లెక్కలను అధికారులు ఇరు రాష్ట్రాల సిఎంల ముందుంచినట్టుగా తెలిసింది. ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల డిమాండ్‌లు ఇలా..

ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు పలు డిమాండ్‌లతో ఈ స మావేశానికి హాజరయ్యాయి. అందులో తెలంగాణ ప్ర ధాన డిమాండ్లు పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఎపి లో కలిసిన ఏడు తెలంగాణ మండలాలను తిరిగి ఇవ్వా లి. విద్యుత్ సంస్థ బకాయిలు 24 వేల కోట్ల రూపాయ లు చెల్లించాలి. కృష్ణా జలాల్లో 558 టిఎంసిలు కేటాయించాలి. టిటిడిలో తెలంగాణకు వాటా ఇవ్వాలి. ఎపి ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ లాం టి భవనాలు అప్పగించాలని ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇక ఎపి ప్రభుత్వం ప్రధాన డిమాండ్‌లలో భా గంగా తెలంగాణ రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలి. కృష్ణాజలాల్లో 512 టిఎంసిలు కేటాయించాలి. ఉద్యోగుల విభజన అంశాలు, ఎజెండాలోని అం శాలతో పాటు షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు, నిధులు, ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి.ఎపి నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగ్‌ల పంపిణీకి సంబంధించిన అంశాలతో పాటు పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల పంపిణీ, రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదాలను పరిష్కరించుకోవాలి. ఇక కృష్ణా జలాల్లో వాటాలు, సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఎపి ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ భవనాల గురించి చర్చించాలని ఈ సమావేశానికి ఎపి ప్రభుత్వం హాజరయ్యింది.

ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన వారిలో…

హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబులు భేటీ అయ్యారు. ఎపి ప్రభుత్వం తరపున మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బిసి జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఎం.జానకి, కా ర్తికేయ మిశ్రాలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి డి ప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఐఏఎస్‌లు రామకృష్ణ, వి.శేషాద్రి, కె.శ్రీనివాస రాజు, రఘునందన్ రావులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు.

బాబుకు బహుమతిగా ‘నా గొడవ’ పుస్తకం

ప్రజా భవన్‌కు వచ్చిన టిడిపి చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజి రాసిన “నా గొడవ” పుస్తకాన్ని సిఎం రేవంత్ చంద్రబాబుకు బహుకరించారు. కాగా, నిజాం కాలం నుంచి 1980 వరకు జరిగిన పాలనతో పాటు నిజాం, బ్రిటిషర్ల పాలన మధ్య తేడాలపై కాళోజీ ‘నా గొడవ’ పుస్తకంలో వివరించారు. దీంతో పాటుగా ఏళ్ల తరబడి జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమాల గురించి ‘నా గొడవ పుస్తకం’లో అనేక అంశాలను కాళోజీ ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక చంద్రబాబు తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిమను తెలంగాణ సిఎం రేవంత్‌కు అందచేశారు.

అపరిష్కృత అంశాలపై
చర్చించాం: రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎపి ము ఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యామని తెలంగాణ సిఎం రేవం త్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు రెండు గంటలు కొనసాగిం ది. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరి ష్కారం కోసం చర్చించినట్లు ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాలకు మేలు: చంద్రబాబు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎపి సిఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివా రం హైదరాబాద్‌లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల కు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై చర్చించాం. ఎపి, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది’ అని చంద్రబాబు వివరించారు. ఈ సమా వేశం తాలూకు ఫొటోలను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News