కారు దిగి హస్తం పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సిఎం రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అధికారం కోల్పోయి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బిఆర్ఎస్ పార్టీకి వరుసుగా షాకులు తగులుతున్నాయి. కారు గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్‌కు మరో షాక్ తగిలింది. తాజాగా, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి శనివారం ఉదయం సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదారంగా ఆహ్వానించారు. కాగా, ఈ రెండురోజుల్లో మరో ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.