మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా రేపటితరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నారాయణ విద్యాసంస్థలు నడుంకట్టింది. విద్యార్థులకు అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్‌ఐటిలలో బిటెక్, ఎంటెక్, ఎంఎస్‌సి పూర్తి చేసిన 180 మంది ప్రతిభావంతులైన అభ్యర్థులను క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసింది. ’నారాయణాస్ నవతరం’ పేరు మీద ప్రత్యేకంగా రిక్రూటి మెంట్ ప్రక్రియను చేపట్టింది.
విద్యార్థులను తమ లక్ష్యాల వైపు నడిపించటంలో అధ్యాపకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాగే ప్రతి అంశంపై విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, జీవితకాల అభ్యాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనది. వివిధ దశల్లో, వివిధ ప్రక్రియల ద్వారా రేపటితరం అధ్యాపకులను తయారుచేయటం నారాయణలో నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. అన్ని ఎంట్రెన్స్‌లలో అత్యంత కీలకమైన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన 180కి పైగా ట్రైనీ ఫ్యాకల్టీ అభ్యర్థులను నారాయణ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నియమించినట్లు విద్యాసంస్థల సీఈఓ పునీత్ కొత్తప తెలిపారు.