హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రపంచ సినీ ప్రేక్షకులకు టైటానిక్, అవతార్ సిక్వెల్స్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రముఖ నిర్మాత జోన్ లాండౌ కన్నుమూశారు. గత 16 నెలలుగా క్యాన్సర్‌తో పోరాటం చేసిన జోన్ లాండౌ(63).. జూలై 5న లాస్ ఏంజిల్స్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కటుంబం ఆలస్యంగా వెల్లడించింది.
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తో కలిసి ఆయన పలు చిత్రాలను నిర్మించారు. 1995 నుంచి వీరిద్దరూ కలిసి సినిమాలను రూపొందించడం ప్రారంభించారు. 27 సంవత్సరాల వీరి భాగస్వామ్యంలో.. ప్రపంచంలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన ఐదు చిత్రాలలో మూడింటిని నిర్మించారు. ‘టైటానిక్’, ‘అవతార్ ‘, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వీరు నిర్మించనవే. ఈ మూడు చిత్రాలు అస్కార్ నామినేట్ అయ్యాయి. ఉత్తమ చిత్రంగా టైటానిక్ సినిమాకు అస్కార్ అవార్డు అందుకున్నారు.
కాగా..హాలీవుడ్ నిర్మాతలు ఎలీ, ఎడీ లాండౌలకు న్యూయార్క్‌లో జన్మించిన జోన్ లాండౌ.. ‘కీ ఎక్స్ఛేంజ్’ (1985), ‘ఎఫ్/ఎక్స్’ (1986), ‘మాన్‌హంటర్’ (1986) వంటి చిత్రాలలో ప్రొడక్షన్ మేనేజర్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. లాండౌకు భార్య జూలీ.. కుమారులు జామీ, జోడీలు ఉన్నారు.