- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమ్స్ లో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
తుది కీతో పాటు మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నది. కాగా, 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
- Advertisement -