Sunday, October 6, 2024

మహిళల ఆసియా కప్ 2024కు భారత జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఐసిసి మహిళల ఆసియా కప్ 2024కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. తొమ్మిదో ఎడిషన్ ఆసియా కప్ టోర్నమెంట్ జులై 19 నుంచి 28 వరకు శ్రీలంకలో టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ ఏడాది చివర్ లో ICC మహిళల T20 ప్రపంచ కప్‌కు ముందు జరగనున్న ఈ టోర్నమెంట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. స్మృతి మంధానను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

మొత్తం ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో భారత్‌తో పాటు నేపాల్, పాకిస్తాన్, యుఎఇ జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తొలి మ్యాచ్ ను జూలై 19న పాకిస్థాన్‌తో జరగనుంది. ఆ తర్వాత జూలై 21న యూఏఈతో, జూలై 23న నేపాల్‌తో తలపడనుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ జూలై 28న జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు దంబుల్లాలో జరుగుతాయి.

జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికె), ఉమా చెత్రీ (వికె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్

రిజర్వ్ ప్లేయర్స్: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News