Saturday, November 23, 2024

కొత్త నేరచట్టాలు ప్రమాదకరం ఎన్నికల తర్వాత కొనసాగుతున్న మోబ్ లించింగ్ : అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నేర చట్టాలు ముస్లింలు, అణగారిన వర్గాలు, దళితులు, నిజం మాట్లాడేవారిని లక్షంగా చేసుకొని తెచ్చినవని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ చట్టాలు దుర్వినియోగం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గతంలో యుఎపిఎ చట్టాన్ని తేగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మద్దతు తెలిపాయని, ఇప్పడు తెచ్చిన చట్టాలు అంతకంటే ప్రమాదకరమ ని ఆయనన్నారు. తప్పు చేసిన పోలీసులపై చర్యలకు సంబంధించి ఈ చట్టంలో లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.

పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా ముస్లింలపై మోబ్ లించింగ్ కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఆరుగురు మోబ్ లించింగ్‌కు గురయ్యారని పేర్కొన్నారు. అమాయకులైన ముస్లిం యువత జైళ్లలో మొగ్గుతున్నారని, పేదరికం వల్ల వారు బయటికి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం లాయర్లు కేవలం సంపాదనపై మాత్రమే దృష్టి సారించకుండా ఈ విషయమై కూడా ఆలోచించాలని, న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేయాలని సూచించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయనన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఆందోళన క ల్గించేవిగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News