Sunday, October 6, 2024

ర్యాలీ కొనసాగవచ్చు

- Advertisement -
- Advertisement -

క్యూ1 ఫలితాలు, ద్రవ్యోల్బణం డేటా కీలకం
ఈ వారం మార్కెట్‌పై నిపుణులు
ముంబై : వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారంలో కంపెనీల మొదటి త్రైమాసికం (క్యూ1) ఫలితాలు, భారతదేశం రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, అమెరి ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక డేటా, గ్లోబల్ ఎకనామిక్ డేటా, ఎఫ్‌ఐఐ, డిఐఐ ప్రవాహం, రాబోయే ఐపిఒలలు ప్రభావం చూపే అవకాశముంది. గత వారం మార్కెట్ దాదాపు స్థిరంగా ఉంది. సెన్సెక్స్ 53.07 పాయింట్లు (0.066 శాతం) స్వల్పంగా పడిపోయి 79,996.60 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు మార్కెట్ సరికొత్త రికార్డులు సృష్టించింది. వారంలో సెన్సెక్స్ మొదటిసారిగా 80 వేల మార్క్‌ను దాటి కొత్త జీవితకాల గరిష్ట స్థాయి 80,392.64 పాయింట్లకు చేరుకుంది. అయితే నిఫ్టీ 24,401 పాయింట్ల కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ వారంలో, ఒక కంపెనీ ఐపిఒ మార్కెట్లో ప్రారంభించబడుతోంది, అయితే 5 కొత్త షేర్లు లిస్ట్ కానున్నాయి. జూన్ నెల నుంచి నిరంతరంగా విక్రయాలు జరుపుతున్న ఎఫ్‌పిఐల వైఖరిలో మార్పు వచ్చింది. జులై నెలలోనే కొనుగోళ్లు చేయడం దేశీయ మార్కెట్‌కు శుభసూచకమన్నారు. ఈ వారంలో ఒక కంపెనీ ఐపిఒ రాఊఓతోంది, అయితే 5 కొత్త షేర్లు లిస్ట్ కానున్నాయి. జూన్ నెల నుంచి నిరంతరంగా విక్రయాలు జరుపుతున్న ఎఫ్‌పిఐల వైఖరిలో మార్పు వచ్చింది. జులై నెలలోనే కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి.
కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు

ఈ వారం వారం నుండి కంపెనీలు 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1) అంటే ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఫలితాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. మొదటగా ఐటి దిగ్గజం టిసిఎస్ తొలి త్రైమాసిక గణాంకాలను జులై 11న విడుదల చేయనుంది. ఆ తర్వాత హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ జులై 12న ఫలితాలను ప్రకటించనుంది. అవెన్యూ సూపర్‌మార్ట్ అంటే డిమార్ట్ తన ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను జూలై 13న విడుదల చేయనుంది. దీంతో ఈ ఫలితాలపై మార్కెట్ దృష్టిపెట్టనుంది.

రిటైల్ ద్రవ్యోల్బణం డేటా

ఈ నెల 12న విడుదల కానున్న దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గమనించాలి. మే లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్ట స్థాయి 4.75 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో 3.2 శాతం నుండి మేలో 3.1 శాతానికి తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం 8.69 శాతం వద్ద స్థిరంగా ఉంది.

దేశీయ ఆర్థిక డేటా

దేశీయ వినియోగదారుల ద్రవ్యోల్బణం డేటాతో పాటు పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ ఉత్పత్తి, బ్యాంకు రుణాలు, డిపాజిట్ రుణ వృద్ధికి సంబంధించిన గణాంకాలు విడుదల కానున్నాయి. మరోవైపు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) జూలై 12న విదేశీ మారక నిల్వల గణాంకాలను విడుదల చేస్తుంది.

అమెరికా ద్రవ్యోల్బణం

ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ జూలై 9న ఒక ముఖ్యమైన ప్రకటనను ఇవ్వనున్నారు. దీని తర్వాత జూలై 10న కీలక ప్రసంగం ఉంటుంది. పెట్టుబడిదారులు ఆయన చేసే ప్రకటనలను గమనించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. దీని తర్వాత అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు జూలై 11న విడుదల కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News