Sunday, October 6, 2024

నీట్ పరీక్ష పేపర్ లీక్ నిజమే: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్‌ ప్రశ్నపత్రం లీకైన మాట నిజమేనని స్పష్టం చేసింది.

అయితే.. ఎంతమందికి లీకైన పేపర్‌ చేరిందో స్పష్టత లేదని.. ఇది తేలాల్సి ఉందని చెప్పింది. పేపర్‌ లీక్‌తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారని.. కానీ, ఈ అంశం 23 లక్షల మందితో ముడిపడిన అంశమని కోర్టు తెలిపింది. అన్ని విధాలుగా పరిశీలించాకే పేపర్ లీకేజ్ పై తుది తీర్పు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కాగా, నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ప్రధాని మోదీ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలో నీట్ రద్దు చేయాలంటూ సుప్రీంలో పలు పిటిషన్లు వేశారు. అయితే.. నీటీ్ పరీక్షను రద్దు చేయోద్దంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఎ రెండూ వేర్వేరుగా అఫిడవిట్‌లలో సుప్రీం కోర్టుకు తెలిపాయి.

కాగా, NEET UG 2024 పరీక్ష దేశవ్యాప్తంగా మే 5న నిర్వహించారు. ఫలితాలు షెడ్యూల్ కంటే పది రోజుల ముందుగా జూన్ 4న ప్రకటించాయి. ఈ పరీక్షలో 67 మంది టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. అంతేకాదు.. కొంతమంది విద్యార్థులకు పరీక్షలో పూర్తి మార్కులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News