Saturday, December 21, 2024

పదవుల పండుగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ నా య కులకు నామినేటెడ్ పదవుల నియామకాలపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సం బం ధించి 08వ తేదీ సోమవారం జీఓ విడుదలైంది. అయితే, గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు 37 కార్పొరేషన్ చైర్మన్‌లను ఎంపిక చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియా మ కపు ఉత్తర్వులు ఆగిపోయాయి. ప్రభుత్వం తాజాగా 442 జిఓ ఆర్‌టి నుంచి 448 జిఓ ఆర్‌టి వరకు 34 మంది చైర్మన్‌లుగా, ఒకరిని వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఉ త్తర్వులను విడుదల చేసింది. ఈ చైర్మన్‌లుగా నియమితులైన వారు రెండు రోజుల్లోగా బా ధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే గతంలో 37 మందికి అవకాశం క ల్పించగా ఈసారి అందులో ఒకరు స్వచ్ఛందంగా తనకు కార్పొరేషన్ పదవి వద్దని జగదీ శ్వర్ రావు సిఎంతో పేర్కొన్నట్టుగా తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఈసారి కార్పొరేషన్ పదవికి ఎంపిక చేయలేదు. ఇక మహిళా కమిషన్ పదవికి నేరెళ్ల శారదను ప్ర భుత్వం గతంలో ప్రతిపాదించగా ఈ పోస్టుకు గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండడంతో ఆమె పేరు కూడా ప్రస్తుతం ఈ జిఓల్లో లేదు. దీంతో ప్రస్తుతం 35 మందికే అవకాశం కల్పించారు. గ తంలో జగదీశ్వర్ రావుకు రాష్ట్ర ఇరిగేషన్ డెవ లప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించగా, ప్రస్తుతం ఆయన స్థానంలో మువ్వా విజయ్‌బాబుకు ఆ పోస్టును కట్టబెట్టారు. గతం లో మువ్వా విజయ్‌బాబుకు ఈడబ్య్లూఐడిసి ప దవిని కట్టబెట్టారు. ప్రస్తుతం ఈడబ్య్లూఐడిసి ప దవిని ఎవరికీ ఇవ్వలేదు.
గతంలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవిని ఇవ్వగా ఈసారి ఆ పదవిని ఎవరికీ ఇవ్వ లేదు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్‌కు ముదిరాజ్ కో ఆపరే టివ్ సొసైటీ కార్పొరేషన్‌ను కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News