Monday, October 7, 2024

పీర్జాదిగూడలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోడుప్పల్: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి సాలార్జంగ్ కంచెలోని సర్వే నెంబరు 1లోని సీలింగ్ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు.ఈ కూల్చివేతల సందర్భంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, నా యకులు అధిక సంఖ్యలో చేరుకుని కూల్చివేతలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మేడిపల్లి తహసీల్దార్ హసీనా ఆధ్వర్యంలో చేపట్టి న ఈ కార్యక్రమానికి మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం త హసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకై కబ్జాదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ మేయర్‌ను దించేందుకు మాజీ ఎ మ్మె ల్యే మలిపెద్దిసుధీర్‌రెడ్డి అనేక రకాల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో చేర్చుకుని మరికొందరి కోసం ప్రయత్నాలు చేశారని కానీ వారు పార్టీకి విధేయులుగా ఉండి పార్టీ మారకపోవడంతో ఆస్తులకు నష్టం కలిగించేలా భయభ్రాంతులకు గురి చేస్తూ అన్ని రకాల అనుమతులు ఉన్న ఈ నిర్మాణాలను సీలింగ్ ల్యాండ్ పేరుతో కూల్చివేతల కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని అన్నారు. కేవలం తనను మేయర్ పదవీ నుండి దించి తన అల్లుడు అమర్ సింగ్‌ను మేయర్ చేయడానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అరాచక రాజకీయానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ దుర్మార్గాన్ని అడ్డుకుంటాం: మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్
అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేస్తోందని ఆరోపించారు. సాయిప్రియలో చిన్న చిన్న ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏ ళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం. అవి అక్రమ భూములు అయితే.. ఆనాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పా లి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురిచేయడం సబబు కాదు. కాంగ్రెస్ వైఖరి వల్ల 300 మంది రోడ్డున పడ్డారు. 30, 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు కలగజేసుకోవటం సరికాదు. పీర్జాదిగూడలో పేదల ఇళ్లు కూల్చేయడం దారుణం. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని కచ్చితంగా అడ్డుకుంటుందని ఈటల స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News